కాలుష్య ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాని

నెల్లూరు: జిల్లాలో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. సర్వేపల్లి మండలం అనంతపురం గ్రామంలో విద్యుత్‌ ప్లాంట్‌ కాలుష్యంతో ఎండిపోయిన చెట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజల కష్టాలు పట్టించుకోకుండా కంపెనీల యాజమాన్యాలు చోద్యం చేస్తున్నాయన్నారు. కాలుష్య నివారణకై కంపెనీ యాజమాన్యాలపై పోరాటం చేస్తామని హెచ్కరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top