కార్యకర్తలే వైయస్ఆర్ సీపీకి పునాది

విజయవాడ

: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే గట్టి పునాదని ఆ పార్టీ నాయకుడు పి. గౌతమ్‌ రెడ్డి చెప్పారు.  విజయవాడ నగర 42వ డివిజన్‌కు చెందిన లాయర్ శివఫణింద్ర కుమార్, పలువురితో కలసి పార్టీలో చేరారు. భగత్ సింగ్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆయనకు గౌతమ్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. మంత్రులు ప్రజాసమస్యల్ని పట్టించుకోకుండా పదవులు కాపాడుకునే పనిలోపడ్డారని ఆరోపించారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రాబోయే కాలం తమ పార్టీదేనన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీలో  ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.

తాజా ఫోటోలు

Back to Top