కాంగ్రెస్‌, టిడిపిలకు సద్బుద్ధినివ్వు తిరుమలేశా!

తిరుపతి, 23 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్‌, టిడిపి నాయకులకు సద్బుద్ధి ఇవ్వాలని కోరుతూ పార్టీ మహిళా విభాగం నాయకులు చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ మహిళా విభాగం చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్ర చేస్తున్న మహిళలను పీలేరులో పార్టీ నాయకురాలు కొండా సురేఖ, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి కలిశారు. పాదయాత్ర చేస్తున్న గాయత్రిదేవికి కొండా సురేఖ అభినందనలు తెలిపారు.
Back to Top