కాంగ్రెస్, టీడీపీలకు కౌంట్‌డౌన్: కొడాలి

గుడివాడ, 06 ఏప్రిల్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపినందుకు తనను నానా మాటలు అన్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. గుడివాడలోని నెహ్రూ చౌక్ లో శనివారం రాత్రి ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగానికి ముందు ఆయన మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలిపారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యి శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాయని ఆరోపించారు. చంద్రబాబు తన చెంచాలతో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పై ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఫొటోను చంద్రబాబు తప్ప ఎవరైనా పెట్టుకోవచ్చని చెప్పారు. మహామహులు గుడివాడ వచ్చి నన్ను ఓడిస్తానని చెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డిని సీయం కాకుండా..నేన్ను అసెంబ్లీకి రాకుండా ఏ శక్తీ ఆపలేదని సవాలు చేశారు.

Back to Top