వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తమకు న్యాయం చేస్తారని బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు అన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. బొబ్బిలి పట్టణానికి తీవ్ర తాగునీటి కొరత ఉందన్నారు.తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు కొన్ని గ్రామాలకే మాత్రమే వస్తుందన్నారు. నిధులు లేక పనులు కూడా నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వం సహకారం లేకపోవడంతో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. నియోజకవర్గంలో మంత్రి ఉన్నారని చెప్పుకోవడానికే తప్ప ఆయన వలన ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. పేరుకు మాత్రమే ఆయన మంత్రిగా చెలామణి అవుతున్నారన్నారు. గతంలో వైయస్‌ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప ఆ తర్వాత కనీసం రోడ్డు సదుపాయం కూడా వేయలేదన్నారు. వైయస్‌ఆర్ హయాంలో నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజి,గ్రోత్ సెంటర్,జూట్‌మిల్లులు వంటి వచ్చాయన్నారు.ప్రస్తుతం టీడీపీ పాలనలో పరిశ్రమలు మూతపడే స్థితికి వచ్చాయన్నారు.