శనివారం సాయంత్రమే జలజాగరణ

అనంతపురం : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న జల జాగరణకు సర్వం సిద్దం
అవుతోంది. జిల్లా లోని  బెలుగుప్పలో
శనివారం సాయంత్రం జల జాగరణ చేపడతామని పార్టీ  ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి  అనంతపురంలో స్పష్టం చేశారు. కృష్ణా జలాల
అనంతపురంకు తీసుకువచ్చిన 
ఘనత దివంగత
ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్‑దే అని విశ్వేశ్వరరెడ్డి
గుర్తు చేశారు. అనంతపురానికి నీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీరు ఇవ్వాలని
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హాంద్రీనీవా ఆయుకట్టుకు వెంటనే నీరు విడుదల
చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ పనులు
నిలిపివేయడం దుర్మార్గమని అన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top