జగ్గయ్యపేటలో నేడు షర్మిల బహిరంగ సభ

జగ్గయ్యపేట (కృష్ణాజిల్లా), 21 ఏప్రిల్‌ 2013: శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 127వ రోజు ఆదివారంనాటి షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, కృష్ణాజిల్లా కన్వీనర్‌ సామినేని ఉదయభాను వెల్లడించారు. ఆదివారం ఉదయం కృష్ణాజిల్లాలోని మక్కపేట నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుందని వారు తెలిపారు.

అక్కడి నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర చిల్లకల్లు వరకు సాగుతుంది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం ఉంటుందని రఘురాం, ఉదయభాను పేర్కొన్నారు. సాయంత్రానికి మరో ప్రస్థానం పాదయాత్ర జగ్గయ్యపేట వరకు కొనసాగుతుంది. జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత రాత్రికి జగ్గయ్యపేటలోనే బస చేస్తారని రఘురాం, ఉదయభాను వివరించారు. ఆదివారంనాడు మొత్తం 14.3 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర ఉంటుందన్నారు.
Back to Top