జగన్‌ విడుదలకు భవానీ భక్తుల పాదయాత్ర

విజయనగరం : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా మారారని వైయస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ పె‌న్మత్స సాంబశివరాజు పేర్కొన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదలను ఆకాంక్షిస్తూ జిల్లాలోని రావాడ గ్రామంలో భవానీ దీక్ష తీసుకున్న 13 మంది వైయస్ అభిమానులు ‌చేపట్టిన పాదయాత్రను శుక్రవారం ఆయన ప్రారంభించారు. రావాడ నుంచి ప్రారంభించిన ఈ పాదయాత్రలో వారంతా సుమారు 450 కిలోమీటర్లు నడిచి విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. పార్టీ నాయకుడు దంతులూరి సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఈ అభిమానులంతా విజయవాడకు పాదయాత్ర చేస్తున్నారు.

ఈ సందర్భంగా సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని ఆరాదిస్తున్నారన్నారు. పేదల కష్టాలు తీర్చడం కేవలం శ్రీ జగన్మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమన్నారు. ఈ విషయాన్ని పేదలంతా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారని చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదల కోరుతూ రావాడ నుంచి 13 మంది భవానీ భక్తులు సుమారు 450 కిలోమీటర్లు మేర పాదయాత్ర ప్రారంభించడాన్ని అభినందించారు. అనంతరం ఆయన రావాడలో ఉన్న‌ దివంగత మహానేత డాక్టర్ వైయస్‌‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కిసాన్ సె‌ల్ అధ్యక్షుడు సింగుబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజ‌య్, పార్టీ నాయకులు గొర్లె వెంకటరమణ, డాక్ట‌ర్ సురే‌ష్ బాబు, జానా ప్రసా‌ద్, మట్టా వెంకట‌ రమణారెడ్డి, సవరవిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తో సిబిఐ కుమ్మక్కు:
కాంగ్రెస్ ప్రభుత్వం ‌సిబిఐతో కుట్ర పన్ని శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించినట్లు ‌పెన్మత్స సాంబశివరాజు దుయ్యబట్టారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారంనాడు నల్లబ్యాడ్జీలతో విజయనగరంలోని పార్టీ కార్యాలయం నుంచి కోట జంక్షన్ మీదుగా పైడితల్లమ్మ ఆలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ‌పెన్మత్స మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల ‌కారణంగా అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పాలన‌ను కోరుకునే ప్రతి ఒక్కరూ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, ‌టిడిపి కుమ్మక్కు రాజకీయాల వల్లే శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలు పాలయ్యారని చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపడతారని చెప్పారు.

అంతకు ముందు శ్రీ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పైడితల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రేమ సమాజంలో వృద్ధులకు అన్నదానం చేశారు. అదే ఆవరణలో ఉన్న జీయ‌ర్ ఎడ్యుకేషన‌ల్ ట్ర‌స్టు ఆధ్వర్యంలో చదువుతున్న బదిర విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top