జగన్ వైపే రాష్ట్ర ప్రజలు: మేకతోటి

ఫిరంగిపురం:

కాంగ్రెస్, టీడీపీలు ఎంత కుమ్మక్కయినా రాష్ట్ర ప్రజలు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారన్న విషయాన్ని ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శ్రీ జగన్మోహన్‌ రెడ్డికి ఒక న్యాయం, మంత్రులకు ఒక న్యాయంలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని  విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మహానేత తనయుడు శ్రీ వైయస్ జగన్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సుచరిత చెప్పారు. గుంటూరు నవభారత్ నగర్‌లో ఎమ్మెల్యే సుచరిత జన్మదినం సంధర్బంగా రెడ్డిపాలెం మాజీ సర్పంచ్ తనుబుద్ధి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 39 కిలోల కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సుచరిత, దయాసాగర్ దంపతులను ఘనంగా సన్మానించారు.

తాజా వీడియోలు

Back to Top