'జగన్ సిఎం అయితేనే మంచి రోజులొస్తాయి'

విశాఖపట్నం‌ : రాష్ట్రంలో ‌విద్యుత్ తిప్పలు తప్పాలన్నా, విద్యు‌త్ కార్మికులకు మంచి రోజులు రావాలన్నా‌ శ్రీ వై‌యస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందని వైయస్‌ఆర్ విద్యుత్ ఎంప్లాయీ‌స్ యూనియ‌న్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణరావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎ.సురే‌ష్‌కాంత రెడ్డి అన్నారు. యూనియన్ ప్రతినిధులు బుధవారం ఈపీడీసీఎ‌ల్ కార్పొరే‌ట్ కార్యాలయంలో డెరైక్టర్లు దొర, సూర్యనారాయణలను కలసి వివిధ సమస్యలపై వినతి పత్రా‌లు ఇచ్చారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, 2007లో జూనియర్ లై‌న్‌మెన్ల నియామకాల్లో విద్యుత్ యాజమాన్యాలు అవలంబించిన విధానాల వల్లే కోర్టు తప్పు‌ పట్టిందన్నారు. పులివెందుల నుంచి అమరనాథరెడ్డితో పాటు 46 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీం సస్పెండ్ చేసిందని చెప్పారు. కానీ, కొందరు కార్మిక సంఘ‌ం నాయకులు గొప్పలు చెప్పుకుంటూ కార్మికులను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు.
Back to Top