జగన్మోహన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే భేటీ

హైదరాబాద్, 02 ఏప్రిల్ 2013:

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బి. లక్ష్మణరావు చంచల్గూడ జైలులో మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు విధానాలతో పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్నారు. అవిశ్వాసం పెట్టాల్సిన చంద్రబాబు శాసన సభ సాక్షిగా పారిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని చెప్పారు. ప్రజలు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. శ్రీ జగన్ నాయకత్వం నచ్చి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పారు.

Back to Top