<p style="text-align:left">హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో 150 స్థానాలను గెలుచుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి అయిన గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.కాంగ్రస్‌కు 60 సీట్లు రావచ్చని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్‌కు తెలంగాణలో 50, సీమాంధ్రలో వంద వరకూ సీట్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ముచ్చటిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని గాదె చెప్పారు. మంచి నేతలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఆయన సూచించారు.<br/><br/><p/><br/></p>