జగన్‌ కోసం జనం ఎదురుచూపులు: ఆకేపాటి

హైదరాబాద్, 8 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి ఎప్పుడు బయటికి వస్తారా అని రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూపులు చూస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అన్నారు. ఆ రోజు రాజశేఖరరెడ్డి ప్రతి కుటుంబానికి సహాయం అందించారని తెలిపారు. ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుందని విశ్వాసం ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి జగన్‌ కొన్నారని ఆరోపించడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని ఖండించారు. జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉన్నారని, కష్టాల్లో ఉన్న పార్టీ వైయస్‌ఆర్‌ సిపి అన్నారు.

ఒక ఎమ్మెల్యే గాని, ఒక నాయకుడు గాని అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారని, అలాంటిది కాంగ్రెస్‌ పార్టీ వైపు గాని, ప్రధాన ప్రతిపక్షం వైపునకు గాని వెళ్ళక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారంటేనే తమ పార్టీ పట్ల ఉన్న విశ్వసనీయతకు ఉదాహరణ అన్నారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర కాదు కదా రాష్ట్రం అంతటా మోకాళ్ళపై యాత్ర చేసినా ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి ఊబిలో‌ పీకల్లోతు కూరుకుపోయిందని అమర్‌నాథ్‌రెడ్డి అభివర్ణించారు. వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి  బయట ఉంటే కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఆత్మస్థైర్యం కోల్పోతారనే ఆయనను  జైలులో పెట్టారని ఆరోపించారు. వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టడం వల్లనే ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేయాల్సి వస్తున్నదని అన్నారు.


Back to Top