జగనన్నవస్తే బతుకులు బాగుంటాయి


పెంజెర్ల (మహబూబ్ నగర్ జిల్లా):

రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్థంగా ఉందని, జగనన్న ముఖ్యమంత్రి అయితే పేద ప్రజల బతుకులు బాగుంటాయని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సొదరి అయిన శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. పదవులను కాపాడుకోవడానికి చూపిన శ్రద్ధ ప్రజల కష్టాలపై పాలకులు చూపడంలేదన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షనేత వారికి వంతపాడుతున్నారని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు.

     'మరో ప్రజా ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా పాలమూరు జిల్లా కొత్తూరు మండలంలోని పెంజెర్ల గ్రామంలో మంగళవారం 54వ రోజు శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. విద్యార్ధుల ఫీజులు కట్టలేక తల్లీదండ్రులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆందోళనలు, ఉద్యమాలు చేస్తే బిక్షం వేసినట్టు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద కొంత మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు.  ప్రజల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగలేదని శ్రీమతి షర్మిల అన్నారు.

     తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు కూడా ఇలాగే వ్యవహరించారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. కరెంటు బిల్లులు కట్టకపోతే రైతులను జైలుకు పంపించిన ఘనత చంద్రబాబుదన్నారు. అందుకు ప్రజలు తగిన గుణపాటం చెప్పారన్నారు.  ప్రజలు వాస్తవాలు గ్రహించి రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేకులను తరిమి కొట్టాలని శ్రీమతి సర్మిల పిలుపునిచ్చారు.

జగనన్న రాజ్యం వస్తుంది...
     రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని శ్రీమతి షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. జగనన్న ముఖ్యమంత్రి మహిళలను తన అక్కా చెల్లెళ్లుగా భావించి వడ్డీలేని రుణాలు అందజేస్తారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తారన్నారు. పిల్లలను స్కూలుకు పంపించలేని నిరు పేదలకు అండగా ఉంటారన్నారు. విద్యార్థులకు ఐదు వందల రూపాయల చొప్పున చెల్లించే ఏర్పాట్లు చేస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

Back to Top