<br/>హైదరాబాద్) తెలుగుదేశం ప్రభుత్వానికి సామాన్య ప్రజలు పెద్దగా పట్టడం లేదు. రెండు వారాలుగా మునిసిపల్ కార్మికుల సమ్మె పట్టించుకోలేదు. పైగా మొన్నటి క్యాబినెట్ సమావేశంలో దీనిపై కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించారు. సమ్మెను అణచివేస్తామని ప్రకటనలు చేశారు. దిక్కు తోచని స్థితిలో మునిసిపల్ జేఏసీ నాయకులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలిశారు. ముందు నుంచి కార్మికుల ఆందోళనకు పార్టీ అండగా నిలుస్తోంది. కార్మిక సంఘాల నేతలతో సమావేశం తర్వాత వైఎస్ జగన్ మండి పడ్డారు. నాలుగు రోజులు గడువు ఇస్తున్నామని, సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపి పరిష్కరించింది. దీంతో మునిసిపల్ సంఘాల నేతలు అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర జరుపుతున్న వైఎస్ జగన్ ను కలిశారు. జగన్ హెచ్చరికతోనే తమ సమస్య పరిష్కారం అయ్యిందని ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు శాలువా కప్పి నంది మొమెంటో ఇచ్చి సత్కరించారు.