రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు

అమరావతిః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేల బృందం రాజధాని ప్రాంత రైతులను కలుసుకుంది. భూమిలిచ్చిన తమను ప్రభుత్వం మోసం చేసిందని రైతులు ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నారు. స్థలాల కేటాయింపు, ప్లాట్ల పంపిణీలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని రైతులు తెలిపారు. గ్రామకంఠాలు డిక్లైర్ చేయకుండా రైతుల భూములను లాక్కొంటూ టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. గ్రామసభలు పెట్టకుండా, ఎస్సీ-ఎస్టీలతో చర్చించకుండా ఇష్టాను సారం ప్రభుత్వం భూములను లాక్కొంటుందని ఎమ్మెల్యేలు అన్నారు. భూములిచ్చిన రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

Back to Top