ఇడుపులపాయకు చిత్తూరు మహిళలు

చిత్తూరు, 1 సెప్టెంబర్‌ 2012: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిని మరవలేమని చిత్తూరు జిల్లా మహిళలు తెలిపారు. మహిళలను లక్షాధికారులను చేసిన ఘనత ఆయనదే వారన్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నుంచి 29 డ్వాక్రా గ్రూపుల మహిళలు ఇడుపులపాయకు పయనం అయ్యారు. ఈరోజు తెల్లవారు జామున మూడు గంటలకు వీరంతా మహానేత వైయస్‌ఆర్‌ ఘాట్‌ను దర్శించుకోవడానికి బయల్దేరారు. మహానేత అంటే తమకు ప్రాణమని వారు చెప్పారు.

Back to Top