వైయ‌స్‌ఆర్‌ విద్యార్థి విభాగంలో పలువురి చేరిక

అనంత‌పురం: కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఉర‌వ‌కొండ‌ నియోజకవర్గ అధ్యక్షులు నవీన్‌ అధ్వర్యంలో 30 మంది విద్యార్థులు బుధవారం వైయ‌స్‌ఆర్‌ విద్యార్థి విభాగంలో చేరారు. స్థానిక వైయ‌స్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థి విభాగ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జిలాన్‌ మాట్లాడుతూ వైయ‌స్‌ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రత్యేక హోదా కోసం అహర్నిషలు పోరాడుతున్నారని దీంతో పాటు వైయ‌స్‌ఆర్‌ విద్యార్థి విభాగ్‌ అధ్వర్యంలో విస్త్రుతంగా చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఎన్‌ఎస్‌యూఐ నాయకులు విద్యార్థి విభాగ్‌లోకి చేరారని తెలిపారు. నాయకులు నవీన్‌ మాట్లాడుతూ భవిష్యత్‌లో విద్యార్థి విబాగ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జిలాన్‌ నాయకత్వంలో విద్యార్థుల సమస్యల పై పోరాడుతామన్నారు. కార్య‌క్ర‌మంలో నటరాజ్, భాస్కర్,రాజశేఖర్, నవీన్, సురేష్‌లు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top