ప్రజల్లోకి వెళ్ళండి: శ్రేణులకు విజయమ్మ ఉద్బోధ

సంగారెడ్డి (మెదక్‌ జిల్లా),

25 జూన్‌ 2013: కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా క్షేత్రంలో విస్తృతంగా పర్యటించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని విజయమ్మ ఉద్బోధించారు. పంచాయతి ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆమె మంగళవారం మెదక్ జిల్లాలో పర్యటిస్తు‌న్నారు. ఈ పర్యటనలో భాగంగా సంగారెడ్డి పట్టణానికి వచ్చిన శ్రీమతి విజయమ్మకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సంగారెడ్డిలో స్థానికులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

కాగా, శ్రీమతి విజయమ్మ సమక్షంలో యువజన కాంగ్రెస్‌ నాయకుడు మనోజ్‌రెడ్డి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. ‌ మనోజ్‌రెడ్డికి శ్రీమతి విజయమ్మ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అందోలు నియోజకవర్గం జోగిపేటలో జరిగే పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో శ్రీమతి విజయమ్మ పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే సమావేశంలో ఆమె ప్రసంగిస్తారు.

Back to Top