విజయసాయిరెడ్డిని పరామర్శించిన గడికోట శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లిన శ్రీకాంత్ రెడ్డి విజయసాయిరెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా  కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డి కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయనకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు డిశ్చార్జ్ అయ్యారు.  ఐతే, శ్రీకాంత్ రెడ్డి ఇన్ని రోజులు అమెరికా పర్యటనలో ఉండడంతో విజయసాయిరెడ్డిని కలుసుకోలేకపోయారు.  ఇవాళ హైదరాబాద్ చేరుకొన్న అనంతరం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.  

తాజా ఫోటోలు

Back to Top