పోరు కొనసాగిస్తాం..ఎమ్మెల్యే రాజన్నదొర

సాలూరు : గత మే 11న జరిగిన సాలూరు కో-ఆపరేటివ్
అర్బన్ బ్యాంక్ ఎన్నికల నిర్వహణలో పలు అవకతవకలు జరిగాయని, అందుకే హైకోర్టును ఆశ్రయించామని
ఎమ్మెల్యే, వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. పలుమార్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదులు చేసినా ఆయన చర్యలు తీసుకోలేదని తెలిపారు. అందువల్లే పలువురు డిఫాల్టర్లు కూడా ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. 

విజయనగరం జిల్లా సాలూరు లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ల
జాబితాలో 3,750 మంది ఉండగా.. అందులో 300కు పైగా మృతుల ఓట్లే ఉన్నాయని
తెలిపారు.  ఏ
ఎన్నికైనా ముందుగా ఓటర్ల జాబితాను ప్రకటించి, అందులో తప్పొప్పులను సరిచేసి
మార్పు, చేర్పుల  అనంతరం తుది జాబితాను విడుదల
చేయాల్సి ఉందన్నారు. కానీ ఇక్కడ ఇవేమీ జరగలేదన్నారు. 50 ఏళ్లకిందట మరణించిన  వారి ఓట్లు కూడా కొనసాగుతున్నాయన్నారు. కనీసం
డిఫాల్టర్ల జాబితాను కూడా ప్రకటించలేదని చెప్పారు. అలాగే బ్యాంక్ ఉద్యోగుల బంధువులు
ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిబంధన్న ఉన్నా.. దానిని సైతం ఉల్లంఘించారని
ఆరోపించారు.  అందుకే
న్యాయపోరాటాన్ని సాగిస్తున్నామని రాజన్నదొర వివరించారు.

 

Back to Top