సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే...

చంద్రబాబు హామీలన్నీ గాలికి...
వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న రైతులు..
శ్రీకాకుళంః టీడీపీ పాలనలో  ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసిన చందాన్న ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్టలి,బుక్కూరు, తెట్టంగి రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వినిపించారు. చంద్రబాబు హామీలు ఏ ఒకటీ నెరవేరలేదని రైతులు వాపోయారు. తోటపల్లి ఆయకట్టుకు హెడ్‌ రెగ్యులేటరి ఏర్పాటు చేయాలని వినతించారు. వరద ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారంగా గెడ్డలు వెడల్పు చేయాలని వైయస్‌ జగన్‌ను కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పర్యటించి  ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదన్నారు. తెట్టంగి బహిరంగ సభలో  సీఎం చంద్రబాబు ఇంటింటికి కుళాయి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అర్హులందరి గృహాలు,పింఛన్లు వంటి హామీలు ఇచ్చారని ఒకటి కూడా అమలు చేయలేదన్నారు.టీడీపీకి చెందినవారికే గృహాలు మంజూరు చేస్తున్నారన్నారు.
Back to Top