<strong>విజయనగరంః</strong> బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండల రైతులు వైయస్ జగన్‌కు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్ హయాంలో పెద్దగెడ్డ జలాశయం ప్రారంభించారని, ఈ ప్రాజెక్టు విస్తరణ జరిగితే బాడంగి మండలానికి అదనపు ఆయకట్టు ద్వారా నీరు వస్తుందని రైతులు అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికి బొబ్బిలి నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వైయస్ జగన్ సీఎం అయితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.