ఎకరానికి రూ. 15వేలు పరిహారమివ్వాలి: విజయమ్మ

పుట్టగుంట:

వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 15వేలు పరిహారం ఇవ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడులో ముంపునకు గురయిన పొలాలను ఆమె సోమవారం పరిశీలించారు. అనంతరం రైతులను పరామర్శించారు. తదుపరి ఆమె పుట్టగుంట వెళ్ళి అక్కడ బుడమేరు వాగు ఉద్ధృతిని పరిశీలించారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యిన తర్వాత రైతులకు మేలు చేకూర్చే చర్యలు చేపడతారని భరోసా ఇచ్చారు. రానున్నది రాజన్న రాజ్యమనీ, ఎవరూ బెంగ పడొద్దనీ విజయమ్మ వారికి సూచించారు.

Back to Top