రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి

మదనపల్లె: పట్టణ శివారు ప్రాంతంలోని జన్మభుమి కాలనీలో వివాదాస్పదమైన రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి హామీ ఇచ్చారు. మదనపల్లె రూరలో పరిధిలోని బసినికొండ జన్మభూమి కాలనీ సమీపంలో ఓ ప్రవేటు వ్యక్తి పెద్ద ఎత్తున స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే ఈ కాలనీకి సంబంధించిన రోడ్డు స్థలాన్ని కూడా తానే కొన్నానని, ఈ స్థలంపై సర్వహక్కులూ తనకే వున్నాయని రోడ్డుకోసం స్థలాన్ని వదిలేదని తేల్చి చెప్పారు. దీంతో స్థానికులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ సర్పంచ్‌ కత్తి కృష్ణమూర్తిని ఆశ్రయించారు. దీంతో స్పందించిన ఆయన వెంటనే ఎమ్మెల్యేకు సమాచారం అందించారు. యుద్దప్రాతిపదికన ఎమ్మెల్యే ఆస్థలాన్ని సందర్శించారు. బసిని కొండ పంచాయతీ ఏర్పడ్డప్పటి నుండి  25 అడుగుల రోడ్డు వుందని అయితే ఇపుడు రోడ్డును కూడా ఆక్రమించుకొని ప్లాట్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గత వారం రోజులుగా రోడ్డు సమస్యపై స్థలం యజమానితో చర్చిస్తున్మాని ఆయితే అతను రోడ్డుకోసం స్థలాన్ని వదలని తేల్చి చెప్పడంతో సమస్యను తమ దృష్టికి తెచ్చామన్నారు. దాదాపు 150 కుటుంబాలను సంబంధించిన రోడ్డును ఆక్రమించుకుంటున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యుక్తం చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే తహశీల్దార్‌ రెడ్డెప్పకు ఫోన్‌ చేసి జన్మభూమి కాలనీ రోడ్డు స్థలాన్ని   సర్వే చేయించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నో ఏళ్ళుగా వున్న రోడ్డును ఎవరూ ఆక్రమించుకోకుండా చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ శాఖ కృషి చేయాలని సూచించారు.

తాజా వీడియోలు

Back to Top