కాకినాడ) తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ కార్యవర్గం విస్త్రతస్థాయి సమావేశం జరిగింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పర్యటనకు ఏర్పాట్ల మీద చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన భేటీ జరిగింది. సీనియర్ నాయకుడు బొత్సా సత్యనారాయణ, ఇతర నేతలు అతిథులుగా హాజరు అయ్యారు. ఈనెల 10న వైఎస్ జగన్ కాకినాడ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే ఆందోళనలో పాలు పంచుకొంటారు. ప్రత్యేక హోదాను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసినందున, ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తోంది. వైఎస్ జగన్ పర్యటన ను విజయవంతం చేయాలని నాయకులు తీర్మానించారు.