దమ్మున్న నాయకుడు జగన్‌ ఒక్కరే!

శ్రీకాకుళం : కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షురాలు సోనియాగాంధీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న ఒకే ఒక్క నాయకుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి మాత్రమే అని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కష్ణదాస్ అ‌భివర్ణించారు.‌ దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర వ్యాప్తంగా 650 మంది మరణిస్తే వారి కుటుంబాలను ఓదార్చేందుకు అంగీకరించని సోనియాగాంధీని ధిక్కరించి, నిలచిన ధైర్యశాలి శ్రీ జగన్మోహన్‌రెడ్డి అని కొనియాడారు. శ్రీకాకుళం బలగ ప్రాంతానికి చెందిన దొండపాటి నవీన్‌కుమార్‌ (మోహన్) ‌కృష్ణదాస్ సమక్షంలో బుధవారం వై‌యస్‌ఆర్‌సిపిలో చేరారు. ఈ సందర్భంగా కష్ణదాస్ మాట్లా‌డారు.

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో శ్రీ ‌జగన్మోహన్‌రెడ్డి ఒక్కరే నాయకుడని కృష్ణదాస్‌ పేర్కొన్నారు. శ్రీ జగన్ నాయకత్వంలో పనిచేయడం‌ తమకు గర్వకారణంగా ఉందన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ అధికారంలోకి వస్తే యువతకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహానేత వైయస్ మరణం తర్వాత రాష్ట్రంలో సమ‌ర్ధుడైన నాయకుడు లేక అభివద్ధి కుంటుపడిపోయిందదని కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రా‌న్ని అభివద్ధి పథంలో నడిపించడం శ్రీ జగన్‌కే సాధ్యం అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ విజయం త‌ప్పదన్నారు.

యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి అన్నారు. పార్టీలకు అతీతంగా పేదల అభివద్ధే ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మహానేత డాక్టర్ వై‌యస్‌కే దక్కిందని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు మార్పు ధర్మారావు తెలిపారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హనుమంతు కిరణ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర, జిల్లా ‌అడ్‌హాక్ కమిటీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, శ్రీకాకుళం పట్టణ కన్వీన‌ర్ ధర్మాన ఉద‌యభాస్కర్ మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరానని‌ ‌దొండపాటి నవీన్ పేర్కొన్నారు. నవీ‌న్‌తో పాటు సుమారు 150 కుటుంబాలు వైయస్‌ఆర్‌సిపిలో చేరాయి.
Back to Top