బాబు అనుచరులే దాడి చేశారు

  • టీడీపీ, బీజేపీలు దళితులను హింసిస్తున్నాయి
  • పశువుల కంటే హీనంగా చూస్తున్నారు
  • దళిత ఓట్లతో గెలిచి మాపైనే దాడులు చేస్తారా
  • తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • వైయస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన

విజయవాడ) గో సంరక్షణ ముసుగులో  టీడీపీ, బీజేపీలు దళితులపై దాడులు చేస్తూ హింసిస్తున్నాయని వైయస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు.  దళితులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

మరిన్ని విషయాలు కల్పన మాటల్లోనే...
()టీడీపీ, బీజేపీలు దళితులను ఓటు బ్యాంకులాగా చూస్తున్నాయి తప్ప  మనుషులుగా చూడడం లేదు. గో సంరక్షణ పేరుతో చట్టాల్ని చేతుల్లోకి తీసుకొని దళితులను పీడిస్తున్నాయి. అమలాపురంలో దళితులపై జరిగిన దాడిని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది
()ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా ప్రభుత్వంగానీ, అధికార పార్టీ నేతలుకానీ స్పందించకపోవడం దారుణం.  ఆదివాసీలతో థింసా డ్యాన్స్ లేస్తూ ఫోటోలకు పోజులివ్వడం తప్ప ముఖ్యమంత్రి వాళ్లకు చేసిందేమీ లేదు.
()చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కారంచేడు, చుండూరు సహా అనేక చోట్ల దళితుల మీద దాడులు జరుదుతూనే ఉన్నాయి.
అధికార పార్టీ అండ చూసుకొని ...దళితుల్ని హింసించినా ఎవరూ ఏం చేయేలేరన్న దైర్యంతోనే దాడులు జరుపుతున్నారు. 
()అభ్యుదయవాదులంతా దళితులపై దాడిని ఖండించారు. కానీ, అధికార పార్టీ మాత్రం వాళ్లపై తీసుకున్న చర్యలు శూన్యం. 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం.  ఎటుపోతుంది ఈ ప్రభుత్వం. 
()ఎస్సీల్లో పుపట్టాలని ఎవరు కోరుకుంటారంటూ ముఖ్యమంత్రి దళితులను అవమానించారు. చంద్రబాబు అనుయాయులు, అనుచరులే ఇప్పుడు అమలాపురంలో జరిగిన దాడుల్లో ఉన్నారు.
()ప్రతీ వేదికలో పేదరికాన్ని నిర్మూలిస్తానని బాబు డైలాగ్ లు చెబుతాడు. కానీ ఆయన పాలన ఎలా ఉందంటే పేదలనే నిర్మూలించే విధంగా ఉంది. సమాజం మొత్తం ఖండించాల్సిన విషయం ఇది. దళితులపై దాడిని వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. వైయస్ జగన్ నాయకత్వంలో ()దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తాం. దళితులపై దాడులను అరికట్టే వరకు  ప్రభుత్వంపై పోరాడుతాం. ప్రభుత్వం కళ్లు తెరిచేవిధంగా పోరాటం చేయాలని దళిత సోదరులకు పిలుపునిస్తున్నాం.
() ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే మోడీ తెలంగాణలో జరిగిన సభలో దళితులపై ప్రేమను ఒలకబోసారు. దళితులను కాదు నన్నుకాల్చండంటున్న మోడీ మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలి. 
()దళితుల్ని మనుషుల్లా చూడండి. పశువుల కంటే హీనంగా చూడొద్దు. మాకు ఆత్మగౌరవం ఉంది. మా ఓట్లతో గెలిచి మాపై దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుండడం ఎంతవరకు సబబు. 
()సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ చనిపోవడానికి ఏబీవీపీ వాళ్లు కారణమయ్యారు. దేశవ్యాప్తంగా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి.  దాడుల మీద విచారణ కమిటీ వేయాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. 
()గోసంరక్షణ చట్టాలున్నవిధంగా దళితుల్ని సంరక్షించేందుకు చట్టాలు తీసుకురావాలి. పశువులకంటే హీనంగా చూస్తున్నారు. వ్యధ చెందుతున్నాం. దళితులపై దాడి జరగకుండా చూడాల్సిన బాధ్యత మోడీ, బాబులపై ఉంది. లేకపోతే ప్రజలే ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతారు.  

చర్మకారుల వృత్తి నాయకులు మాట్లాడుతూ...అమలాపురం దళిత పార్లమెంట్ నియోజకవర్గమని, నీను మారాను అని బాబు ప్రాధేయపడితే ఓట్లేశామని చెప్పారు. పెద్దమాదిగనై పుడతానంటూ మాదిగ సోదరుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇవాళ మామీదే దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. మాపై దాడి చేసిన వారిని టీడీపీ నాయకులే దాచిపెట్టారన్నారు. వాళ్లని అరెస్ట్ చేసి చట్టానికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. లేక పోతే దళితులు ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించే. త్వరలోనే నిజనిర్ధారణ కమిటీ అక్కడ పర్యటిస్తుందని తెలిపారు. 

Back to Top