రిజర్వేషన్లపై బాబుకు చిత్తశుద్ధి లేదు

అనంతపురం: కాపు, బోయ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్లను బుట్టదాఖలు చేసేందుకే అసెంబ్లీలో తీర్మాణం చేశారని విమర్శించారు. అనంతపురం జిల్లా గుంతకల్‌ నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 వాగ్ధానాల్లో ఏ ఒక్కటి కూడా టీడీపీ నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు పాలనలో విసిగి పోయిన ప్రజలంతా వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్రకు తరలివస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు. 
Back to Top