చౌకబారు విమర్శలు మానుకోండి: వాసిరెడ్డి

మహబూబ్‌నగ‌ర్, 6 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలపై చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నవారిపై పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీమతి షర్మిలపై టిడిపి మహిళా నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర కోసం జర్మనీ బూట్లు వాడుతున్నారంటూ వారు చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని ఆమె తెలిపారు. చౌకబారు విమర్శలు మానుకోవాలని పద్మ హెచ్చరించారు.
టిడిపి మహిళా నాయకుల మాటలు వింటుంటే చంద్రబాబు నుంచి వారు అబద్ధాలు మాట్లాడటంలో ఎంతగా శిక్షణ పొందారో స్పష్టం అవుతోందన్నారు. వీరితో పాటు ఒక వర్గం మీడియా కూడా అసత్యాలనే రాస్తున్నదని పద్మ మండిపడ్డారు. శ్రీమతి షర్మిల జర్మనీ బూట్లు వినియోగించడం వల్లే వేగంగా నడుస్తున్నారని టిడిపి నాయకురాళ్ళు భావిస్తే పాదయాత్రలో నడవలేక అవస్థలు పడుతున్న తమ నాయకుడు చంద్రబాబుకు కూడా జర్మనీ బూట్లు ఇవ్వాలని సలహా ఇచ్చారు.
Back to Top