గుంటూరు: చంద్రబాబు పరిపాలనలో ప్రజలంతా చిత్రహింసలకు గురవుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి విమర్శించారు. గుంటూరు వైయస్ జగన్ దీక్ష ప్రాంగణం వద్ద ఆయన మాట్లాడుతూ... మిర్చి రైతులకు అండగా ఉండి ప్రభుత్వంపై పోరాడి, వారికి మద్దతు ధర ఇప్పించడానికి వైయస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేస్తుంటే కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ విలువలను చంద్రబాబు పూర్తిగా దిగజార్చుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో కులం, మతం, పార్టీలకు అతీతంగా పరిపాలించిన వ్యక్తి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. రైతుల సంక్షేమాన్ని కాంక్షించి వైయస్ఆర్ ఉచిత విద్యుత్‌ను అందజేశాడన్నారు. అంతటితో ఆగకుండా రుణమాఫీ చేశాడన్నారు. వ్యవసాయం ముఖ్యం అనే ఉద్దేశ్యంతో రైతుల కోసం ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తులు సిగ్గు, లజ్జ లేకుండా తెలుగుదేశం పార్టీలో చేరి వైయస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే వైయస్ఆర్ పరిపాలన మళ్లీ తిరిగొస్తుందని తెలిపారు. రైతులంతా వైయస్ఆర్ సీపీకి మద్దతు పలికి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలన్నారు.