చంద్రబాబుకు మునీశ్వరుడి శాపం!

ధర్మవరం

26 అక్టోబర్ 2012 : నిజం చెబితే చంద్రబాబు తల పగిలిపోతుందా! వైయస్ చెప్పిన మునీశ్వరుడి కథను గుర్తు చేసి షర్మిల ధర్మవరం సభను నవ్వులతో ముంచెత్తారు. చంద్రబాబు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడరని ఎత్తిపొడిచారు.
వైయస్ఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారంటూ చంద్రబాబు ఒక వ్యాఖ్య చేశారనీ, అది విన్నప్పుడు చాలా బాధ కలిగిందనీ ఆమె చెప్పారు. "అయితే వైయస్ చెబుతుండే ఒక మాట గుర్తుకు వస్తోంది. చంద్రబాబుకు ఒక మునీశ్వరుడి శాపం ఉందట. నిజం చెబితే ఆయన తల వేయి ముక్కలై పోతుందట! అది నిజంగా నిజమేననిపిస్తోంది." అని షర్మిల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ఆమె అన్నారు. అలాగే పోలీసు కాల్పులు జరిగితే రైతులను కాకుండా కాల్చిన పోలీసులను పరామర్శించిన చరిత్ర చంద్రబాబుదని ఆమె వ్యాఖ్యానించారు.
"ప్రభుత్వాన్ని దించేయడానికి పాదయాత్ర అవసరమా? 'అవిశ్వాసం' పెట్టి దించేయవచ్చు. మేము మద్దతు ఇస్తామని కూడా చెప్పాం.
 కానీ ఆ పని చేయకుండా చంద్రబాబు పాదయాత్రలంటూ డ్రామాలు ఆడుతున్నారు:" అని ఆమె ఆక్షేపించారు. నిజానికి కాంగ్రెస్, చంద్రబాబు మధ్య డీల్ ఒకటి ఉందనీ, బాబు మీద కేసులు లేకుండా కాంగ్రెస్ చూస్తే, ప్రభుత్వాన్ని బాబు కాపాడతారనీ, అందుకే అవిశ్వాసం పెట్టరని ఆమె అన్నారు. రాష్ట్రలో రెండు పార్టీలు ఉండకూడదనుకుంటున్నారనీ, మూడో పార్టీ రాకుండా కుట్రలు చేస్తున్నారనీ ఆమె మండిపడ్డారు. ఇలా కుట్రలు పన్నే జగనన్నను జైలుకు పంపారనీ, బెయిలు కూడా రాకుండా అడ్డుకుంటున్నారనీ ఆమె విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top