ఒంగోలు: తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వెన్నపూస గోపాల్‌రెడ్డి, యండపల్లి శ్రీనివాసులురెడ్డి గెలుపు పట్ల ప్రకాశం జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. దర్శి పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చుతూ వేడుకలు జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.<br/>