బడ్జెట్ ఆమోదంలోనూ నియంత ధోరణే..!


హైదరాబాద్) అసెంబ్లీ లో తెలుగుదేశం ప్రభుత్వం నియంత పోకడలు ప్రదర్శిస్తోంది.
నిబంధనలకు పాతర వేస్తూ వ్యవహరిస్తోంది.  బడ్జెట్ కు మూజువాణి ఓటు తో ఆమోదం తెలిపింది.
ద్రవ్య వినిమయ బిల్లు మీద ఓటింగ్ జరపాలని వైఎస్సార్సీపీ కోరింది. ఇందుకు వీలుగా
నిబంధనలు చూపినప్పటికీ పట్టించుకోలేదు.  దొంగచాటుగా ప్రభుత్వం మూజువాణి ఓటు తో
నెగ్గించుకొని బయట పడింది. ప్రజాస్వామ్య విలువల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలోకి
తొక్కింది.

  వైఎస్సార్సీపీ విప్ జారీ

  వారం రోజుల ముందే సభకు తప్పనిసరిగా హాజరు
కావాలని వైఎస్సార్సీపీ తరపున ఎంపికైన ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేసింది. ఈ
సభకు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని కోరటం
జరిగింది. పార్టీ విప్ అమర్ నాథ్ రెడ్డి పేరు మీద దీన్ని జారీ చేసి సభ్యులు
అందరికీ అందచేయటం జరిగింది. విప్ జారీ చేసిన విషయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్
కు లేఖ ద్వారా అందచేయటం జరిగింది. 

ఓటింగ్ కోసం పట్టు

ద్రవ్య వినిమయ బిల్లు కోసం డివిజన్ ఓటు కావాలని వైఎస్సార్సీపీ అడగటం జరిగింది.
ఈ మేరకు ముందుగానే లేఖ ఇవ్వటం జరిగింది. అంతే గాకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
అందరికీ విప్ జారీ చేసినట్లు కూడా మరో లేఖను స్పీకర్ కు అందించారు. దీనికి
వైఎస్సార్సీపీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను జత చేసి పొందుపరిచారు. దీన్ని
వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం కార్యదర్శి సుజయ్ క్రిష్ణ రంగారావు అందించారు. 

స్పష్టంగా అడుగుతున్నా బేఖాతరు

బడ్జెట్ ఓటింగ్ సందర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి  యనమల రామక్రిష్ణుడు మాట్లాడుతూ ద్రవ్య వినిమయ
బిల్లు  మీద డివిజన్ ఉండదని చెప్పారు. అటు
స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. దీనికి ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిబంధనల్ని చదివి
వినిపించారు. బిల్లుల ఆమోదానికి సంబంధించి ఓటింగ్ అడగటం ప్రతిపక్షాల హక్కు అని
స్పష్టం చేశారు. అయినప్పటికీ స్పీకర్ అంగీకరించలేదు. విపక్ష సభ్యులు నిరసన
తెలుపుతున్నప్పటికీ పట్టించుకోకుండా మూజువాణీ ఓటుతో బడ్జెట్ ను ఆమోదించటం
జరిగింది. ఆ వెంటనే సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. 


Back to Top