పేదలను కొట్టి పెద్దలకు

హైదరాబాద్ః ఇసుక ధరలు పెంచి సామాన్యుల మీద భారం మోపుతూ చంద్రబాబు కొన్ని వేల కోట్ల రూపాయలను మంది మార్బలానికి దోచిపెట్టారని బొత్స ఫైరయ్యారు. ఇసుకను ఆదాయ వనరుగా రాజకీయంగా ఉపయోగించుకుంటూ... వాస్తవాలను తొక్కిపెడుతూ కంటితుడుపుగా లెటర్లు రాస్తున్నారని నిప్పులు చెరిగారు.  ప్రజాధనాన్ని నిలువు దోపిడీ చేసే ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 

పారిశ్రామిక వేత్తల ముసుగులో రాజధానిలో మూడు పంటలు పండే 80 వేల ఎకరాల భూమిని దోచేశారు. బందరు పోర్ట్ లో 40 వేల ఎకరాలపై  కన్నేశారు. పేదలను కొట్టి చంద్రబాబు పెద్దలకు దోచిపెడుతున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైట్ గిరిజనుల హక్కు... తవ్వకాలు చేయడం నేరమని వైఎస్ జగన్ చింతపల్లిలో చెప్పిన విషయాన్ని బొత్స ఈసందర్భంగా గుర్తుచేశారు. బాక్సైట్ వద్దని వేలాది గొంతులు నినదిస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఉదయం లేచింది మొదలు దేంట్లో లాభం వస్తుంది, ఎలా దోచుకుందామన్న ధ్యాసే తప్ప చంద్రబాబుకు ప్రజాసమస్యలే పట్టడం లేదని బొత్స ఫైరయ్యారు. ప్రజలు అమాయకులు కాదని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. 

Back to Top