బొగ్గు కుంభకోణంపై సీబీ'ఐ'

న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణంపై సీబీఐ కన్నేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు కంపెనీలపై ఏకకాలంలో దాడులు ప్రారంభించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఇళ్లు, సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. 2006 నుంచి 2009 మధ్య కాలంలో కేటాయింపులపై దృష్టి సారించిన సీబీఐ మెరుపు దాడులకు శ్రీకారం చుట్టింది. మొత్తం 30 కంపెనీల లావాదేవీలను విచారిస్తున్నారు. 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్లతో పాటు మన రాష్ట్రంలోనూ పలు సంస్థలతో పాటు ప్రముఖుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచీల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Back to Top