వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

పామ‌ర్రు) వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ లో బైక్ ర్యాలీ తీశారు.  డాక్టర్ బీ ఆర్ అంబేద్క‌ర్ శ‌త జ‌యంతి వేడుక‌ల్ని విజ‌య‌వంతం చేయాల‌ని నిన‌దిస్తూ ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటైంది. నియోజ‌క వర్గ స‌మ‌న్వ‌య క‌ర్త సింహాద్రి ర‌మేష్ బాబు నాయ‌క‌త్వంలో వంద‌లాది యువ‌కులు బైక్ ల‌తో ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పార్టీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు మేరుగ నాగార్జున విచ్చేశారు. మొద‌ట తోటాప‌ల్లి లో ని అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం బ‌స్టాండ్ సెంట‌ర్ లోని దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హానికి పుష్ప మాల వేసి అంజ‌లి ఘ‌టించారు. త‌ర్వాత బైక్ ల‌తో యువ‌కులు పెద్ద ఎత్తున ప‌ట్ట‌ణంలో ర్యాలీ తీశారు. 
Back to Top