నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం


విజయనగరంః ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సాలూరులో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సాలూరు పట్టణంలో  అతిపెద్ద లారీ పరిశ్రమ ఉందన్నారు. ఆంధ్రపదేశ్‌లో విజయవాడ తర్వాత అతి పెద్ద పరిశ్రమ సాలూరులోనే ఉందన్నారు. లారీలు కొనేవారికి ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, లారీ పరిశ్రమకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు.. చదువులేకపోయిన డ్రైవింగ్‌ లైసెన్సులు ఇస్తామని హామీ ఇచ్చారని  కాని ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు. నియోజకవర్గంలో మూడు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఉన్నాయని వీటి ద్వారా  సుమారు 46 ఎకరాల సాగుచేయల్సివుందని నేటికి వాటికి «ఆధునికీకరణ చేయలేదన్నారు.  మరో 25వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్న టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఒక హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు కష్టాలపాలు చేశారని విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం  జననేత వైయస్‌ జగన్‌ ఎండ,వాన లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్నారన్నారు.ప్రజల కోసం నిత్యం తపన పడుతూ మళ్లీ రాజన్న రాజ్యం తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.
 
Attachments area

తాజా ఫోటోలు

Back to Top