బాబు పాపం పండే రోజు వస్తుంది

  • ప్రజలను మోసం చేయాలని చూస్తే సహించరు
  • బాబు మాదిరి వెంకయ్యనాయుడు నోటికి ప్లాస్టర్ తప్పదు
  • శిశుపాలుడికి పట్టిన గతే బాబుకు పడుతుంది
  • రాష్ట్రంలో గాడ్సే ప్రభుత్వం కొనసాగుతోంది
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీడీపీ, బీజేపీలపై మండిపడ్డారు. విగ్రహాలను, ఆలయాలను, మసీదులను కూల్చేస్తూ చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. బాబు, వెంకయ్యనాయుడులు  రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురాకుండా తప్పుడు విధానాలతో ప్రజలను మభ్యపెట్టేలా పిచ్చి వాదనలు  చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు.  హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు.

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే....
()హోదా సంజీవని కాదు. హోదా కన్నా ఎక్కువ సదుపాయాలు కల్పిస్తాం. ఇది సున్నితమైన అంశమంటూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నిన్న విజయవాడలో మాట్లాడడం దారుణం. 
()చంద్రబాబే వెంకయ్యనాయుడితో ఈ పాట పాడిస్తున్నారన్న భావన కలుగుతోంది. అలా మాట్లాడినందుకే చంద్రబాబు ఈ మధ్య నోటికి ప్లాస్టర్ వేసుకున్నారు. వెంకయ్యనాయుడు గారు మీరు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్రత్యేకహోదా ఉంటే తప్ప రాష్ట్రం బాగుపడదని మీరే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడేమో మాట మార్చుతున్నారు. 
()ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే చిత్తశుద్ది మీకు, మోడీకి ఉందా లేదా చెప్పండి అంటే.. హోదా కన్నా బాగా చేస్తాం. సున్నిత అంశమనడం సరైంది కాదు. 
()హోదా ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి వచ్చాక సున్నితమైంది అంటారా..?తప్పుడు విధానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు పిచ్చి వాదనలు తీసుకురావొద్దు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాయే సంజీవని. ఇది తప్పనిసరిగా మీరు చేయవల్సిన అంశం. 
()ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వైయస్సార్సీపీ అనేక సార్లు ఉద్యమించింది. అధ్యక్షులు వైయస్ జగన్ నిరాహార దీక్షలు కూడా చేశారు
మొన్న రాష్ట్ర బంద్ కూడా ప్రజల మనోభావలకు అనుగుణంగా దిగ్విజయంగా జరిగింది.
()ఏపీ ప్రజలను మోసం చేయాలని చూస్తే సహించరన్న విషయం వెంకయ్యనాయుడు, బీజేపీలు తెలుసుకోవాలి. ప్రత్యేకహోదాపై తెలుగుదేశం పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలి. 
() జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గం. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం మహాత్మ ఎన్నో త్యాగాలు చేశారు. ప్రపంచదేశాలన్నీ మహాత్మాగాంధీ విగ్రహాలను ప్రతిష్టించి ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటుంటే...బాబు ప్రభుత్వం నీచంగా ఆ మహనీయుడుని విగ్రహాన్ని పడగొట్టి కాల్వలో పడేసింది. ఇంత కండకావరమా. 
()మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని రాజధానిలో కళ్లారా చూడలేక కుళ్లు, జలసి మనస్తత్వంతో  తొలగించే పరిస్థితికి వచ్చాడు. ఏకంగా దేవాలయాలను కూల్చేస్తూ రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడు. ఉన్మాదంతో దర్గాలను కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు. 
()చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. శిశుపాలుడు చేసిన తప్పులను శ్రీకృష్ణుడు లెక్కించి శిరచ్ఛేదనం చేసిన సంగతి చూశాం.ఇవాళ కూడా ఏపీలో బాబు చేస్తున్న ప్రతీ తప్పును ప్రజలు లెక్కిస్తున్నారు. పాపం పండే రోజే వస్తుంది.
() మహాత్మా ప్రాంతాన్ని సందర్శించి అక్కడ మాట్లాడేందుకు మా ప్రతినిధి బృందం విజయవాడకు వెళ్లింది.
()దేవాలయాలు, మసీదులు, విగ్రహాలు, శ్మశానాలను కూల్చేయడం అన్యాయం. రాజధానిలో భూములను దోచుకొంటూ  రాష్ట్రాన్ని విదేశాలకు అమ్మేస్తున్నాడు.  అన్నింటినీ కూలదోసి రాజధానిలో విదేశీ విగ్రహాలు పెడతారా బాబు. 
()క్విట్ ఇండియా నినాదంతో మహాత్మాగాంధీ ఇతర దేశస్తులను బయటకు ఏవిధంగా పంపించారో...ఏపీ ప్రజలు కూడా విదేశీ తొత్తుగా ఉన్న చంద్రబాబును క్విట్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితి వస్తుంది.
()బాబు చేసిన తప్పులు సరిదిద్దుకోకపోతే శిశుపాలుడికి పట్టిన గతే పడుతుంది. ఆరుకోట్ల మంది ప్రజలు బాబు చేస్తున్న పనులను చూసి ఛీఛీ అనుకుంటున్నారు. 
() చంద్రబాబు కాదు ఆయన గాడ్సే బాబు. మహాత్మాగాంధీ అంటే లెక్కలేని గాడ్సే ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోంది. 
()ప్రత్యేకహోదా సాధనే వైయస్సార్సీపీ ధ్యేయమని అంబటి రాంబాబు మరోసారి స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top