చంద్రబాబువి సిగ్గుమాలిన రాజకీయాలు

కాకినాడః ప్రజలకు ఊపిరి సలపని హామీలిచ్చి, ఆశలు పెట్టి మోసపూరితంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారని  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు.కాకినాడలో జరుగుతున్న వంచన గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేకహోదాను తీసుకురావడంతో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజాసంక్షేమం వదిలి స్వలాభాలకు కోసం మోదీ చుట్టూ తిరిగారన్నారు.మొసలి కన్నీరు కారుస్తూ అధర్మపోరాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నిన ప్రజలు నమ్మే పరిస్థితిలేదన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి జిల్లాలో యువభేరిలు నిర్వహించి ప్రజల్లో,విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. పదవులు ముఖ్యంకాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. తృణపాయంగా ఎంపీ పదవులను వదులుకుని ప్రత్యేకహోదాపై పోరాటం చేశారన్నారు. అధికారం కోసం ఎంత దిక్కుమాలిన చర్యలకైన చంద్రబాబు సిద్ధపడతారని విమర్శించారు.ఆంధ్రను అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌తో జతకట్టి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు.చంద్రబాబు  సిగ్గుమాలిన రాజకీయాలు చూసి ప్రజలు తలదించుకుంటున్నారన్నారు.
Back to Top