ప్రజల ఆరోగ్యంతోనూ చెలగాటమా..


వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి

శ్రీకాకుళంః ఏపీలో చంద్రబాబు దుర్మార్గపు పాలన చివరకు ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటమాడుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. ఏపీలో ఆరోగ్యశ్రీ వెంటిలేటర్‌పై ఉందన్నారు. 80 వేల రోగులకు చెల్లించాల్సిన రూ.500 కోట్ల బిల్లును చెల్లించడంతో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు.  పేదల ఆరోగ్యమే లక్ష్యంగా  ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి లక్షలమంది గుండె ఆపరేషన్లు,ఇతర ఆపరేషన్లు చేయించి ప్రజల గుండెల్లో కొలువైన దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలను  చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తుందన్నారు. పేదలకు కార్పొరేట్‌ ఆసుప్రతి వైద్యం చేయించిన వైయస్‌ఆర్‌ సేవలు ప్రపంచ దేశాలు కూడా గుర్తించి ప్రశంసలు కురిపించాయన్నారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడంలేదన్నారు.పేదలకు చేయూతగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత  పేరు మార్చారు కాని నిధులు ఇవ్వలేదన్నారు.ఆరోగ్యశ్రీని టీడీపీ ప్రభుత్వం అటకెక్కిస్తోందన్నారు.చంద్రబాబుకు ఆరోగ్యశ్రీ పట్ల శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు కలిగించే పథకాన్ని నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. ఆరోగ్యాన్ని కొనుకోలేని  పేద ప్రజలకు అత్యంత అవవసరమైన ఆరోగ్యశ్రీ పథకంపై నిర్లక్ష్యం వహించడం పట్ల చంద్రబాబు సిగ్గుపడాలన్నారు.

Back to Top