<br/><strong>వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు..</strong><br/><strong>ఢిల్లీః </strong>ప్రత్యేకహోదా సాధనకు వైయస్ జగన్ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ అహర్నిశలు పోరాడుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.ఎన్నికల సమయంలో ఆరువందల అబద్ధపు హామీలిచ్చి గెద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిందన్నారు.వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..మరో పక్క ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారన్నారు.ప్రత్యేకహోదా,విభజన హామీలను అమలుపర్చడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను తీవ్రంగా వంచించాయన్నారు.వైయస్ జగన్‌తోనే ఏపీ అభివృద్ధి బాట పడుతుందని తెలిపారు.