ఇది చంద్రబాబు చాలెంజ్

హైదరాబాద్)) రాజధాని వ్యవహారంలో జరుగుతున్నది స్విస్ చాలెంజ్ కాదని, చంద్రబాబు చాలెంజ్ అని ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్, వైయస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి వ్యవహారాల్ని రాజకీయాలకు అతీతంగా నిశితంగా పరిశీలించటం జరిగిందని పేర్కొన్నారు. అమరావతి పేరుతో అచ్చంగా దోపిడీ జరుగుతోందని పేర్కొన్నారు. అన్నీ సింగపూర్ కంపెనీలకు ప్రయోజనం కలిగించే రీతిలోనే విధానాల్ని రూపొందించటం జరిగిందని వివరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top