ఆత్మకూరులో వైయస్‌ఆర్‌సీపీ బూత్‌ కమిటీ సభ్యుల సమావేశం

నెల్లూరు జిల్లాః ఆత్మకూరులో వైయస్‌ఆర్‌సీపీ మండల స్థాయి బూత్‌ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ ఓట్ల చేర్పులు, మార్పులపై దృష్టి పెట్టి అర్హులందరిని ఓటర్లుగా చేర్చాలని సూచించారు.   నవరత్నాలపై ప్రజలకు విస్తృతస్థాయి ప్రచారం నిర్వహించాలన్నారు. కోవూరు తూర్పు అరుంధతివాడలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
Back to Top