వైఎస్సార్సీపీ అభిమానుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్థంతిని పురస్కరించుకొని దశల వారీగా అమెరికాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. జార్జియాలోని అల్ఫరెట్టాలో ఈ నెల 12న రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లైఫ్ సౌత్ కమ్యూనిటీ బ్లడ్ సెంటర్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో 32 మంది దాకా రక్త దానం చేశారు. వీరికి లైఫ్ సౌత్ బ్లడ్ డ్రైవ్ కోర్డినేటర్ నికియా జోన్స్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సౌత్ ఫర్సిత్ హై స్కూల్ వలంటీర్లకు ఫుడ్ సర్వ్ చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో 75 మందికి పైగా వైస్సార్సీపీ అభిమానులు, దివంగత వైఎస్సార్ బంధువులు, మిత్రులు పాల్గొన్నారు. శ్రీనివాస రెడ్డి కొట్లూరు, నంద గోపీనాథ రెడ్డి, వెంకట్రామిరెడ్డి చింతం, నరేష్ గువ్వ, సుధీర్ రెడ్డి బసు, గురు ఆర్ పరదామి, వెంకట్ మీసాల, దామోదర్ రెడ్డి పుష్పాల, గిరీష్ రెడ్డి మేక, క్రిష్ణా నర్సేపల్లి, జగదీశ్వర్, రాజశేఖర్ రెడ్డి కాశిరెడ్డి, వెంకట్ మందెడ్డు, శ్రీని వంగిమల్ల, పుల్కరం శ్రీనివాస్, నరసింహారెడ్డి, రమేష్ దువ్వూరి, వినయ్ తన్వీ, ఉమా మహేశ్వర్ రెడ్డి కవలకుంట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ యూఎస్ఎ ఎన్ ఆర్ ఐ కమిటీ కన్వీనర్ గురవారెడ్డి పుణ్యాల మార్గనిర్దేశకత్వం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top