చంద్రబాబును అరెస్టు చేయాలి: గిడ్డి ఈశ్వరి

విశాఖపట్టణం (పాడేరు): ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును తక్షణమే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పాడేరు మెయిన్‌రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబేనని ఆడియో టేపుల ద్వారా తేటతెల్లమైందన్నారు. దీంతో సీఎంగా కొనసాగే అర్హత ఆయనకు లేదని,  చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలని గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.
Back to Top