అపోలో ఆస్పత్రి నుంచి షర్మిల డిశ్చార్జి

హైదరాబాద్: మోకాలికి కీ హోల్‌ శస్త్ర చికిత్స చేయించుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల బుధవారంనాడు అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో గాయపడిన ఆమెకు జూబ్లీహిల్సులోని అపోలో ఆస్పత్రిలో మంగళవారం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. శ్రీమతి షర్మిలకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుడు డాక్టర్ రఘువీ‌ర్‌రెడ్డి బుధవారం ఉదయం పరీక్షించారు. శ్రీమతి షర్మిల మోకాలిని పరీక్షించామని, లిగమెంట్, కార్టిలేజ్ పనితీరు మెరుగైందని ‌డాక్టర్‌ రఘువీర్ ‌వెల్లడించారు. శ్రీమతి షర్మిల పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు వారాలు పడుతుందని ఆయన తెలిపారు.
Back to Top