సమస్య వస్తే రాజాం వెళ్ళాల్సిందే..


మంత్రి ఉన్నా అభివృద్ధి శూన్యం..

శ్రీకాకుళంః ఎచ్చెర్ల నియోజకవర్గంలో కనీస సదుపాయాలు కూడా లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక ప్రభుత్వ కార్యాలయం కూడా లేదని, ఏదైనా సమస్య వస్తే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం వెళ్లాల్సి వస్తుందన్నారు.వైయస్‌ఆర్‌ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయన మరణానంతరం ఎక్కడకక్కడ ఆగిపోయాయన్నారు.పెండింగ్‌ పనులపై టీడీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదన్నారు.స్థానిక సమస్యలు వైయస్‌ జగన్‌ను దృష్టికి తీసుకువస్తామని ప్రజలు,నేతలు అన్నారు.ఒక మంత్రి ఉండి కూడా ప్రజలు సమస్యలు పరిష్కార కాలేదన్నారు.సమస్యల చెప్పుకోవడానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండటంలేదని మండిపడ్డారు.తోటపల్లి ప్రాజెక్టు వైయస్‌ఆర్‌ బిక్ష అని ఈ సందర్భంగా ప్రజలు అన్నారు.నియోజకవర్గంలోని శివారు గ్రామాల్లో నేటికి కూడా సాగునీరు అందడం లేదన్నారు.మడ్డవలస శివారు గ్రామాలకు కూడా సాగునీరు అందడం లేదన్నారు.

Back to Top