హంగూ, ఆర్భాటాలే తప్ప ఆదరణ కరవు

వైఎస్సార్
జిల్లాః  గత 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వైఎస్సార్ జిల్లాలో
 ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆమ్జద్
బాషా అన్నారు. ముఖ్యమంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి.... హెలికాప్టర్ లో
వచ్చి ఒకటి, అరా చూసి ఫోటోలు దిగడం తప్ప ఎక్కడా కూడా వాళ్ల సమస్యలు
తెలుసుకోకపోవడం దారుణమన్నారు. ఇళ్లు, పంటలు కోల్పోయి నిరాశ్రయులైన
బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. అనేక
గ్రామాల్లో భూమి కుంగిపోతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నా ప్రభుత్వం
ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

హంగూ
ఆర్భాటాలే తప్ప ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే చేయడం
లేదని అమ్జజ్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ
నెరవేర్చకుండా జనచైతన్య యాత్రల పేరుతో టీడీపీ ప్రజలను మోసగిస్తోందని
దుయ్యబట్టారు. 18 నెలల్లో ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్నైనా అందించారా,
సమస్యలు తెలుసుకున్నారా  అని బాషా ప్రభుత్వాన్ని నిలదీశారు.  రాష్ట్రంలో
 రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు
కోల్పోయి తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు. పంటలు చేతికిరాక, చేతికందిన
పంటలకు గిట్టుబాటు ధర లేక, రుణాలు మాఫీ కాక రైతులు ఆత్మహత్య
చేసుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం తక్షమమే బాధితులను ఆదుకోవాలని
డిమాండ్ చేశారు. 
Back to Top