మీ ఆస్తులపై విచారణ కోరొచ్చుగా: అంబటి

హైదరాబాద్, సెప్టెంబర్ 20: చంద్రబాబు ప్రతి ఏటా ఆస్తులపై కల్లబొల్లి ప్రకటనలు చేసే బదులు ఆయనే చట్టబద్ద సంస్థలతో విచారణ కోరుకోవచ్చు కదా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సలహా ఇచ్చింది. ఆయన ఇప్పటి కైనా దర్యాప్తునకు ముందుకు రావాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఆస్తుల ప్రకటన ప్రజలను వంచించే ప్రయత్నంలో బాబు చేసుకుంటున్న ఆత్మవంచన కార్యక్రమం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. హెరిటేజ్ కంపెనీలో వందల కోట్ల ఆస్తులు, బాలాయపల్లి భూములు, హైటెక్ సిటీ పరిసరాల్లో ఫాం హౌస, హైదరాబాద్ లో ఆయన తనయుడి పేరు మీద ఉన్న ఇల్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, తమిళనాడుతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులు, సంపద, నగలు, నగదు.. ఇవన్నీ చంద్రబాబు రాజకీయాల్లో ప్రజాసేవ చేసుకుంటూ సంపాదించారంటే అంతకు మించి గిన్నిసు బుక్ కు ఎక్కించాల్సిన అంశం ఉంటుందా అని ప్రశ్ని౦చారు.

Back to Top